Ricky Ponting: కోహ్లీని మించిన బ్యాటర్ లేడు..రికీ పాంటింగ్ 1 y ago
వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లిని మించిన బ్యాటర్ను తాను చూడలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. అతడు సచిన్ను అధిగమించి ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలవగలడని చెప్పాడు. కోహ్లి 51వ వన్డే శతకంతో పాకిస్థాన్తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. "కోహ్లిని మించిన వన్డే బ్యాటర్ను నేను చూడలేదు. అతడు ఇప్పుడు నన్ను (అత్యధిక వన్డే పరుగుల్లో) దాటేశాడు. ఇద్దరు బ్యాటర్లు మాత్రమే తన కన్నా ముందున్నారు. కోహ్లి అత్యధిక స్కోరర్గా నిలవాలని భావిస్తాడనంలో సందేహం లేదు" అని పాంటింగ్ అన్నాడు. పాక్పై సెంచరీ చేసే క్రమంలో కోహ్లి వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.